ఏసీబీ ఇన్ స్పెక్టర్ పేరుతో బెదిరింపు కాల్స్

ఏసీబీ ఇన్ స్పెక్టర్ పేరుతో బెదిరింపు కాల్స్
  • 8 మంది వద్ద రూ. 3 .40 లక్షలు వసూలు
  • హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి అరెస్ట్

ఎల్​బీనగర్, వెలుగు: ఏసీబీ ఇన్ స్పెక్టర్ ని అంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తిని ఎల్ బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. జల్సాలు చేసేందుకు  ఈజీగా మనీ సంపాదించేందుకు నాగర్ కర్నూలుకు చెందిన ఏఎఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్, నల్లగొండకు చెందిన టీవీ మెకానిక్ రాపోలు అనిల్ కుమార్ ఏసీబీ అధికారులమంటూ పలువురికి బెదిరింపు కాల్స్ చేసి..  8 మంది వద్ద రూ. 3 లక్షల40 వేలు వసూలు చేశారు. 

కొత్తపేటకు చెందిన బాధితుడు సుధీర్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు  ను  దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద  బైక్ ,2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గొర్రెల స్కాంలో పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అంజనప్పకు కూడా బెదిరింపు కాల్స్ చేసి రూ. లక్ష వసూలు చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.