రజాకార్ సినిమా నిర్మాత గూడురుకు బెదిరింపు కాల్స్

రజాకార్ సినిమా నిర్మాత గూడురుకు బెదిరింపు కాల్స్

హైదరాబాద్,వెలుగు: రజాకార్ సినిమా నిర్మాత, బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడురు నారాయణరెడ్డికి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంపై తీసిన ఈ చిత్రానికి గూడురు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా పలు థియేటర్లలో నడుస్తున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 1100 వరకూ కాల్స్ వచ్చాయని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. 

దీనిపై విచారణ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గూడురుకు ముగ్గురు సీఆర్పీఎఫ్​కమాండర్లను కేటాయించింది. ప్రతి రోజూ ఇద్దరు సెక్యూరిటీ అందించేలా చర్యలు తీసుకున్నది.