నన్ను చంపేస్తామంటూ ఫోన్లు వస్తున్నయ్: రాజాసింగ్

నన్ను చంపేస్తామంటూ ఫోన్లు వస్తున్నయ్: రాజాసింగ్
  •     అమిత్​షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్, వెలుగు :  చంపేస్తామని బెదిరిస్తూ పాలస్తీనా నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. తనను, తన ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్​ ఇచ్చారన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ రాశారు. బుధవారం చాలా సార్లు కాల్స్ వచ్చాయని, ధర్మం కోసం పనిచేస్తే చంపేస్తామని ఓ వ్యక్తి బెదిరించారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 నా ఫోన్ నంబర్ల గురించి ఆరా తీస్తే సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని ఆయన తెలిపారు. గతంలో ఇలా చాలా సార్లు కాల్స్ వచ్చాయని అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన లేఖలో గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారో లేదో , విచారణ జరిపిస్తుందో లేదో చూడాలని ఆయన తెలిపారు.