24 గంటల్లోనే ముగ్గురు నిందితుల అరెస్ట్

24 గంటల్లోనే ముగ్గురు నిందితుల అరెస్ట్

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలాపత్తర్ లో రౌడీ షీటర్ ఇస్మాయిల్ హత్య కేసును పోలీసులు చేధించారు. కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మాదాపూర్, ఎస్ఓటీ పోలీసులు 24 గంటల్లోనే  నిందితులు జిలానీ, మునాయిద్, ఫిరోజ్ లను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ సందీప్ తెలిపారు. నిందితుల నుంచి రెండు కంట్రీమెడ్ పిస్టల్స్, 7రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

‘‘సోమవారం ఉదయం 4 గంటలకు మాదాపూర్ నీరుస్ జంక్షన్ రోడ్డులో వ్యాపారి ఇస్మాయిల్, జహంగీర్ లపై మొహమ్మద్ ముజాహీద్ కాల్పులు జరిపాడు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. జహీరాబాద్ లో 200 గజాలు ల్యాండ్ విషయంలో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరగడంతో ముజాహిద్ ఇస్మాయిల్ పై కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ తలకు బుల్లెట్ తగలడంతో హెడ్ ఇంజ్యూరీ అయ్యింది. హాస్పటల్ కు తీసుకెళ్లేసరికే  చనిపోయాడు. జహంగీర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దాడి చేసిన వెంటనే నిందితులు పారిపోయారు. నిన్న ఉదయం 10 గంటలకు జహీరాబాద్ లో ముగురు నిందితులను అరెస్ట్ చేశాం’’ అని డీసీపీ  వెల్లడించారు.