మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

నవీపేట్, వెలుగు : మండలంలో గత నెల 24న జరిగిన మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులకు ఏసీపీ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 24న మద్దేపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి (బుజ్జి)ను ఫతేనగర్ శివారులో హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారన్నారు. మృతురాలి చెల్లి పోసాని ఫిర్యాదు మేరకు నార్త్ రూరల్ సీఐ. బి.శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారన్నారు. 

అనుమానం వచ్చి ఫకీరాబాద్ కు చెందిన సంగీత, పద్మ, బాబులను విచారించగా లక్ష్మితో మంచి పరిచయం ఉందన్నారు. మృతురాలు ఈ ముగ్గురు మధ్య డబ్బుల విషయంలో గొడవలు కావడం తో ఎలాగైనా లక్ష్మిని హత్య చేయాలని ప్లాన్​ వేసి  హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్సై తిరుపతి, యాదగిరి గౌడ్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, ఏఎస్సై గపూర్, క్రైమ్ టీమ్ నవీపేట్ పీఎస్ సిబ్బంది ని ఏసీపీ అభినందించారు.