కాగజ్​నగర్​ అడవుల్లో సీసీ కెమెరాలకు చిక్కిన పులులు 

కాగజ్​నగర్​ అడవుల్లో సీసీ కెమెరాలకు చిక్కిన పులులు 

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు మూడు చిరుతలు తిరుగుతున్న చిత్రాలు చిక్కాయి. ఈ నెల 7న ఈ ఫొటోలు తీసినట్టు అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్​ శివకుమార్ మాట్లాడుతూ డివిజన్​అడవుల్లో పులులు, చిరుతలు తిరగడం సాధారణమేనని, వాటి భద్రత దృష్ట్యా పులుల ఫొటోలు ఎక్కడ తీసింది చెప్పలేమన్నారు. అయితే ఒకటి, రెండు కాకుండా ఏకంగా మూడు చిరుతలు ఒకేసారి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.