అందోల్​లో బీఆర్ఎస్​కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా

అందోల్​లో బీఆర్ఎస్​కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా

జోగిపేట,వెలుగు : అందోల్​లో బీఆర్ఎస్​ కు  భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మంగళవారం రాజీనామా చేశారు. తమకు బీఆర్​ఎస్​లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, త్వరలోనే కాంగ్రెస్​లో చేరతామని ప్రకటించారు. మంగళవారం12 వార్డు కౌన్సిలర్​నాగరాజు,14వ వార్డు కౌన్సిలర్ ​దుర్గేశ్, 20వ వార్డు కౌన్సిలర్​ చందర్​ నాయక్​ మాట్లాడారు. గతంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యకు వ్యతిరేకంగా మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టినా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ పట్టించుకోలేదన్నారు. 

ఎమ్మెల్యే మద్దతుతో చైర్మన్​ ఏకపక్ష  నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తమ వార్డుల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే  నిధులను అడిగితే ఇవ్వలేదన్నారు. తమపట్ల ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ​పార్టీలో చేరతామని స్పష్టం చేశారు.