
సికింద్రాబాద్, వెలుగు : టెక్నికల్సమస్యల కారణంగా పలు మార్గాల్లో నడుస్తున్న స్పెషల్రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి– -కాచిగూడ, కాకినాడ టౌన్– -సికింద్రాబాద్– -కాకినాడ టౌన్, నర్సాపూర్– -సికింద్రాబాద్– -నర్సాపూర్ రైళ్లు
ఈ నెల17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండవన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఇదే మార్గాల్లో నడుస్తున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్రైళ్లు ఈనెల 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.