
- మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంప్ యార్డ్ వద్ద ఘటన
- మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారే...
జవహర్‌నగర్, వెలుగు : బతుకుదెరువు కోసం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని మల్కారంలో రాంకీ డంప్ యార్డు పవర్ ప్రాజెక్ట్ రెండో దశ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వందల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా చుట్టుపక్కల ఇండ్లను అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. బుధవారం ఉదయం చిమ్నీ పనుల్లో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా పైనుంచి లిఫ్ట్తెగి పడింది.
ఈ ప్రమాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ మండల్(24), అమిత్‌రాయ్(20), సురేశ్సర్కార్(21) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఈసీఐఎల్‌లోని ప్రైవేట్దవాఖానకు తరలించగా, అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఇదే ప్రమాదంలో మరికొందరు గాయపడ్డట్టు సమాచారం. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లిఫ్ట్ గుంతలో పడి వృద్ధురాలు..
జీడిమెట్ల : ప్రమాదవశాత్తు లిఫ్ట్గుంతలో పడి ఓ వృద్ధురాలు చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజేశ్వరి (61) మూడు రోజుల క్రితం చింతల్పరిధిలోని స్ప్రింగ్అపార్ట్మెంట్లో ఉండే కూతురు ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు కిందకు వెళ్లడానికి లిఫ్ట్వద్దకు వచ్చి గేట్ ఓపెన్చేసింది. అయితే ఆ టైంలో లిఫ్ట్ పైఅంతస్తులో ఉంది. గేటు ఓపెన్ కావడంతో లిఫ్ట్వచ్చిందనుకుని రాజేశ్వరి కాలు పెట్టగా గుంతలో పడి చనిపోయింది. సాంకేతిక సమస్య వల్లే లిఫ్ట్ గేటు ఓపెన్ అయ్యిందని, దీంతో ప్రమాదం జరిగిందని జీడిమెట్ల పోలీసులు భావిస్తున్నారు.