బాహుబలి దున్నకు మూడు కేజీల గోల్డ్ చైను

బాహుబలి దున్నకు మూడు కేజీల గోల్డ్ చైను

హైదరాబాద్​ సదర్​ ఉత్సవాల్లో బాహుబలి దున్న స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. రెండు వేల కిలోలకు పైగా బరువున్న దీన్ని హర్యానా నుంచి తెచ్చారు. రేటు రూ.30 కోట్లట. రోజు కిరాయి కోటీ ముప్పై లక్షలు. డైలీ మెయింటెనెన్స్​ లక్షపైనే. ఇగ దీని ఫుడ్డు.. రెండు పూటలా రెండు డజన్ల యాపిల్స్, పూటకు కేజీ డ్రై ఫ్రూట్స్, రాత్రికి ఓ ఫుల్​ బాటిల్. పొద్దున్నే వాకింగ్​, ఆవనూనెతో మసాజ్​. సదర్​ కోసం దీన్ని తెచ్చిన లడ్డూ యాదవ్ దీని మెడలో మూడు కిలోల బంగారు గొలుసు వేసి ఊరేగించారు.