- మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఇంజినీర్
పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌కు పెద్ద ఎత్తున మంటలు అంటుకొని ఇద్దరు పైలట్లు, ఓ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఢిల్లీలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. పుణెలోని ఆక్స్‌ఫర్డ్ కౌంటీ గోల్ఫ్ కోర్స్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ముంబైలోని జుహుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గోల్ఫ్ కోర్స్‌కు సమీపంలో ఉన్న బవ్‌ధాన్ కొండ ప్రాంతంలో ఉదయం 7.40 గంటలకు హెలికాప్టర్ కూలిపోయిందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలతో పాటు పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అయితే, అప్పటికే హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.