హోం క్వారంటైన్ లోకి ట్రంప్ దోస్త్

హోం క్వారంటైన్ లోకి  ట్రంప్ దోస్త్

అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డైరెక్టర్,  క‌రోనా టాస్క్‌ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ క్వారెంటైన్‌లోకి వెళ్లారు.  కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడే కాదు డొనాల్డ్ ట్రంప్ కు స్నేహితుడులాంటి వారని వైట్ హౌజ్ అధికారులు చెబుతున్నారు.  నోటి దురుసుతో ప్రత్యర్థులకు చిక్కకుండా ట్రంప్ ను కాపాడడంలో ఫౌసీ దిట్ట. వైట్ హౌస్ నుంచి దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ పాపులర్ ఫౌసీ..   ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి కరోనా సోకడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా  క్వారంటైన్ కు వెళ్లారు. ఫౌసీతో పాటు డాక్ట‌ర్ రాబ‌ర్ట్ రెడ్‌ఫీల్డ్‌, డాక్ట‌ర్ స్టీఫెన్ హ‌న్‌లు ఉన్నారు. వాస్త‌వానికి క‌రోనా ప‌రీక్ష‌లో ఫౌసీకి నెగ‌టివ్ వ‌చ్చింది. కానీ క్వారంటైన్‌లో ఉండ‌నున్నారు.  ప్రస్తుతం ఆంథోనీ ఫౌసీ ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, అవసరం అయితే వైట్ హౌజ్ వస్తారని అధికారులు తెలిపారు.