
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ.. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. క్రాంతి, రవితేజ, శశిధర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మురళీధర్ వద్ద క్రాంతి, శశిధర్ కొనుగోలు చేశారు. అలాగే డీఏవో ప్రశ్నపత్రాన్ని సాయిలౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేశారు. వీరిని ఆరెస్ట్ చేసిన అధికారులు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఇప్పటికీ మొత్తం ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 30కు చేరింది.
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అనుకున్నంత వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టుగా అనిపించటం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి సిట్అధికారులు దూకుడును పెంచారు.