కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై సైంటిఫిక్‌ డేటా పరిశీలన

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై సైంటిఫిక్‌ డేటా పరిశీలన

దేశంలో ఇప్పటి వరకు 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, అందులో 117 మంది పూర్తిగా రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు చెప్పారు. డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1.53 రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. ‘‘183 ఒమిక్రాన్ కేసులను అనలైజ్ చేయగా.. అందులో 121 మంది ఫారెన్‌ ట్రావెల్ హిస్టరీ ఉంది. ముగ్గురు వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా వేసుకున్న వాళ్లు ఉన్నారు. 44 మందికి అయితే ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే ఒమిక్రాన్ వచ్చింది. ఇందులో చాలా మంది విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వాళ్లే ఉన్నారు. 87 మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లున్నారు. కొంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నోళ్లు కూడా ఉన్నారు. ఏడుగురు వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు, ఇద్దరు ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు ఉన్నారు. 16 మందికి వ్యాక్సిన్ అర్హత లేని వాళ్లు ఉన్నారు. 73 మంది వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియాల్సి ఉంది” అని రాజేశ్ భూషణ్‌ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై ఒక పాలసీ రూపొందించేందుకు సైంటిఫిక్ డేటాను లోతుగా పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. బూస్టర్ డోసు, చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్‌పై ఇమ్యూనైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇచ్చిన సూచనలపై పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు.