పంజాగుట్ట, వెలుగు: బీసీల కులగణనలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మోసం చేశాయని, బీసీ సమాజానికి మూడు రాజకీయ పార్టీలు క్షమాపణ చెప్పాలని బీసీ ఇంటెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ఐఏఎస్ టీ. చిరంజీవులు డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మూడు రాజకీయ పార్టీలు బీసీలతో ఆటలాడుతున్నాయని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎలికట్టె విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని ఓపెన్ కేటగిరీలో బీసీలంతా నామినేషన్లు వేయాలని సూచించారు.
