
హైదరాబాద్ మియపూర్ లో తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఒక పిస్తోల్, ఒక తాపంచ, రెండు మ్యాగజైన్ లు,13 బుల్లెట్లు,6 మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం10 గంటలకు నిందితులు గన్స్ తో సంచరిస్తున్నారన్న పక్క సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. స్వాన్ లియోనార్డ్ కన్నా అనే పాత నెరస్థుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ వెపన్స్ ను బీహార్ నుండి తెచ్చినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై పోలీసుల నిఘా ఉండటంతో వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో బీహార్ కు చెందిన ఆలోక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని..అతడే నిందితులకు గన్స్ సమకూర్చినట్లు వెల్లడించారు.