జీడిమెట్ల, వెలుగు : దుండిగల్ పీఎస్పరిధిలోని మల్లంపేట్, ప్రణీత్ప్రనవ్వ్యాలీ హోమ్స్‌లో 2021లో జరిగిన దోపిడీ కేసులో కోర్టు ముగ్గురికి ఐదేండ్ల జైలు శిక్ష, రూ. రూ.2000 జరిమాన విధించింది. నాలుగేండ్ల కింద 11 మంది ప్రణీత్ప్రనవ్వ్యాలీ హోమ్స్గోడ దూకి లోపలికిప్రవేశించారు. సెక్యూరిటీని తాళ్లతో కట్టి, తుపాకులతో బెదిరించి స్టోర్‌రూమ్‌లోని రూ.24లక్షల విలువైన ఎన్సీబీ, ఆర్సీసీబీ బండిల్స్ దొంగిలించారు.
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించిన కోర్టు శైలేంద్రసింగ్ (22) ధర్మేంద్ర కుమార్ (26), సత్యభాన్ సింగ్ (23)లకు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది.
