సోమవారం ( నవంబర్ 3 ) ఉదయం జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. కంకర లోడుతో రాంగ్ రూట్లో ఎతివేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ముగ్గురు కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన యువతులు సాయి ప్రియ, నందిని, ముస్కాన్ లు కోఠి మహిళా యూనివర్సిటీ విద్యార్థులని ప్రిన్సిపాల్ లోక పావని తెలిపారు.
ఈ ప్రమాదంలో తమ ముగ్గురు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమని అన్నారు ప్రిన్సిపాల్. ఈ.సాయి ప్రియ 3rd ఇయర్ బీఏస్సి , ఈ.నందిని 1సst ఇయర్ బికాం స్టూడెంట్స్ కాగా.. ఇద్దరు అక్క చెల్లెల్లు అని తెలిపారు. మరో మృతురాలు ముస్కాన్ 3rd ఇయర్ ఎంపిసిఐఎస్ స్టూడెంట్ అని తెలిపారు.వీరు ముగ్గురు తాండూరు వాసులని.. సాయి ప్రియ , ముస్కాన్ హాస్టల్ స్టూడెంట్స్ కాగా.. నందిని డే స్కాలర్ అని తెలిపారు ప్రిన్సిపాల్.
ఆదివారం కావడంతో ఇళ్లకు వెళ్లిన స్టూడెంట్స్ తిరిగొస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించారని తెలిపారు ప్రిన్సిపాల్. ముగ్గురు మంచిగా చదివే పిల్లలు మరణించడం బాధాకరమని అన్నారు ప్రిన్సిపాల్ లోక పావని. ప్రమాదంలో తమ స్నేహితులు ముగ్గురు మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు తోటి స్టూడెంట్స్.
ఇదిలా ఉండగా.. చనిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు.. ఆర్టీసీ తరపున 2 లక్షల రూపాయలు.. మొత్తం 7 లక్షల రూపాయలను తక్షణ సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక తక్షణ సాయం ప్రకటించిన మంత్రి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు స్పష్టం చేశారాయన. చికిత్స కోసం అవసరం అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ వైద్యం అందిస్తామని.. బాధితులకు అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.
