
శ్రీనగర్‌లోని పంతా చౌక్ వద్ద భద్రతా బలగాలకు మరియు టెర్రరిస్టులకు మధ్య గత రాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.
‘శ్రీనగర్ లోని పంతా చౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా నాకా బందీ నిర్వహించాయి. ఈ నాకా బందీపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) బాబు రామ్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పోలీసులు మరియు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పంతా చౌక్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు జరిపారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయారు’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
For More News..