ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. అవంతిపొరా జిల్లాలోని నాగబెరాన్ త్రాల్ ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. నాగబెరాన్ త్రాల్ అడవుల్లో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందడంతో... జమ్మూకశ్మీర్ పోలీసులు, CRPF, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్ కౌంటర్ స్పాట్ నుంచి రెండు AK 47 రైఫిల్స్, ఒక SLR గన్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని  వకీల్ షా అని గుర్తించారు. బీజేపీ నేత రాకేశ్ పండిత హత్యలో వకీల్ షాకు ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.