ప‌రిగిలో దొంగ‌ల బీభ‌త్సం.. భారీగా బంగారం, వెండీ స్వాధీనం

ప‌రిగిలో దొంగ‌ల బీభ‌త్సం.. భారీగా బంగారం, వెండీ స్వాధీనం

వికారాబాద్ జిల్లా : ప‌రిగి మండ‌లంలో వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల‌ను ప‌రిగి పోలీసులు ప‌ట్టుకున్నారు. బుధ‌వారం రాత్రి మరో దొంగతనానికి పాల్పడుతుండగా.. డైరెక్ట్ గా పట్టుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం చేసేందుకు వచ్చిన ఆరుగురిలో ..ముగ్గురుని పట్టుకున్నామ‌ని.. మరో ముగ్గురు పరారయ్యారని చెప్పారు. పరారైన వాళ్లకోసం వెతుకుతున్నామ‌ని..  కొన్ని రోజులుగా పాయంత్రంపూట‌ తాళాలు వేసిన ఇళ్లను రెక్కిలు చేసి, రాత్రి స‌మ‌యంలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. దొంగలను పట్టుకునేందు ఓ టీం ను తయారు చేసి, ఎలా పట్టుకొవాలి అనే విషయంలో.. సిఐ లక్ష్మీ చెప్పిన విధంగా దొంగలను పట్టుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

పరిగి మండల పరిధిలో, వికారాబాద్ జిల్లా పరిధిలో ఏడు చోట్ల‌ భారీ దాంగతనాలకు పాల్పడ్డారని.. ప్రస్తునానికి వారి దగ్గర నుంచి 17 తులాల వెండి,  3 తులాల బంగారు స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామ‌న్నారు. దొంగ‌ల‌ను విచారించగా ..వికారాబాద్ జిల్లాలోనే కాకుండా వరంగల్, రంగారెడ్డి , మహబూబ్ న‌గర్ జిల్లాలలతోపాటు.. గోవాలో కూడా దొంగతనాలకు పాల్పడిన‌ట్లు నేరం ఒప్పుకున్నార‌న్నారు.  మరో 9 తులాల బంగారాన్న ముత్తూట్ ఫైనాన్స్ లో తాక‌ట్టు పెట్టిన‌ట్లు ర‌శీదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ లక్ష్మీ రెడ్డి తెలిపారు. పరారీలో మరో ముగ్గురు దొంగలు ఉన్నార‌ని.. వీరంతా మొయినాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించినట్లు తెలిపారు సిఐ లక్ష్మీ రెడ్డి. మరో ముగ్గురికోసం గాలిస్తున్నామ‌ని.. దొంగిలించిన సొమ్మును రికవరి చేస్తామని సిఐ తెలిపారు.