జవహర్ నగర్ డంపింగ్ యార్డు పనుల్లో అపశృతి..లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి

జవహర్ నగర్ డంపింగ్ యార్డు పనుల్లో అపశృతి..లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో జరుగుతున్న పవర్ ప్రాజెక్టు పనుల్లో అపశతి చోటు చేసుకుంది. బుధవారం (మే7) సాయంత్రం ప్రమాదవ శాత్తు లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

 ప్రాజెక్టులో భాగంగా చిమ్నీలో పనులు జరుగుతుండగా అందులో పనిచేస్తున్న కార్మికులపై పడింది. ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. చికిత్సకోసం ఈసీఐఎల్ లోని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. 

బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది.

►ALSO READ | మాదాపూర్లో వాటర్ ట్యాంకర్ ఢీకొని..సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి