
నిందితుడిపై కేసు.. రిమాండ్కు తరలింపు
సిద్దిపేట: సిద్దిపేటలో మూడేండ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మైత్రివనం కాలనీలోని అపార్టుమెంట్ లో నేపాల్ కు చెందిన ఓ కుటుంబం వాచ్ మెన్ గా పని చేస్తోంది. మూడేళ్ల బాలిక తాత, నాన్నమ్మతో కలిసి ఉంటోంది. కాగా.. యూపీకి చెందిన అజయ్ అనే యువకుడు ఈనెల 19న అపార్ట్ మెంట్ కింద ఆడుకుంటున్న చిన్నారిని థర్డ్ ఫ్లోర్ కు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడిచేశాడు. గమనించిన తోటి కార్మికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇవాళ హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలి తాత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.