
ఎల్ బీనగర్, వెలుగు : బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి మూడేండ్ల జైలుశిక్ష పడింది. -ఎల్ బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని కృష్ణ జిల్లాకు చెందిన సంగెపు హనుమంతరావు (60) ఉపాధి కోసం సిటీకి వచ్చి ఎల్ బీనగర్ లో ఉంటున్నాడు. 2018లో స్థానికంగా ఉండే బాలికతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబసభ్యులు ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ అందజేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుల్లోని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టం కింద నిందితుడు హనుమంతరావును దోషిగా నిర్ధారిస్తూ మూడేండ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ.. బాధితురాలికి ప్రభుత్వం ద్వారా రూ. లక్ష పరిహారం అందిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.