యూట్యూబ్ వ్యూస్ కోసం కొత్త ఐడియా.. ముగ్గురు యువకులు అరెస్ట్

యూట్యూబ్ వ్యూస్ కోసం కొత్త ఐడియా.. ముగ్గురు యువకులు అరెస్ట్

సోషల్‌ మీడియాలో పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లో కంటెంట్‌ క్రియేషన్‌లో భారీగా పోటీనెలకొంది. యూట్యూబ్‌లో లైక్‌లు, వ్యూస్‌ కోసం నెటిజన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కంటెంట్‌ను క్రియేట్ చేయాలని కొత్త కొత్త ఆలోచనలతో వీడియోలను చేస్తున్నారు. 

ఏదైతేనేం తమ వీడియోలకు వ్యూస్‌, లైక్‌లు రావాలని కొందరు హద్దులు దాటుతున్నారు. న్యూ క్రియేటివిటీ పేరుతో చట్టాన్ని సైతం లెక్కచేయడం లేదు. వ్యూస్‌ పిచ్చిలో పడి జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం.. కొత్త రకం ఆలోచన చేసిన యువకులు జైలు పాలయ్యారు.. అది కాస్త బెడిసి కొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయ్యి రిమాండ్ కు వెళ్ళిన ఘటన ములుగు జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది. ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు “విలేజ్ థింగ్స్”పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టారు. 

Also Read : అప్పుడు నన్ను.. ఇప్పుడు తుమ్మలను అవమానించారు : పొంగులేటి

చిన్న చిన్న వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ.. వీవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పై ఎక్కువ వ్యూస్ రాకపోవడంతో కొత్తరకం వీడియో ఒకటి చేసి యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా ఉండాలని ఆలోచించారు. అడవిలో వేటకు సంబంధించిన వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని వారు ఆలోచించారు.

దీంతో అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి అనే టైటిల్ పెట్టి.. అడవిలో అడపలతో అడవి కోళ్లను వేటాడం ఎలా అనే వీడియో తీశారు. వీడియోలో అడపలతో(పెద్ద రాయి) ఉచ్చును బిగించి అందులో అడవి కోడి ఒకటి పడ్డట్టు, దాన్ని చంపి కాల్చి తింటున్నట్టు వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్ లో 8 నవంబర్ 2022 లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంట పడింది. ఆ వీడియో అటవీశాఖ ఉన్నత అధికారుల కంట పడటంతో వీడియోలో ఉన్న ముగ్గురు యువకులపై ఫారెస్ట్, పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.