
రాష్ట్రంలో గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి చేతికొచ్చే స్థితిలో ఉన్న పంట నేలపాలైంది. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో బుధవారం ఓ మోస్తారు వర్షం కురిసింది. కాగజ్ నగర్ పట్టణంలోని కౌసర్ నగర్ వార్డు నెంబర్ 9లో ఓ భవనంపై పిడుగు పడింది.
దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిడుగు పాటుతో భవనం గోడ పగిలిపోయింది. పిడుగుపాటుతో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాఓ పలుచోట్ల మోస్తరు వాన కురిసింది.