వాళ్లను టికెట్ ఎట్లడగాలె

వాళ్లను టికెట్ ఎట్లడగాలె

టీఆర్ ఎస్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల పంపిణీ వ్యవహారం సమస్యగా మారింది. పాత, కొత్తనేతల మధ్య విభేదాలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తమకు దక్కిన అధికారంతో ఎమ్మెల్యేలు తమ అనుచరులకే టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా పార్టీలో కి వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఆ అధికారం ఉండటంతో.. వాళ్లూ  తమ వారికే టికెట్లు ఇస్తున్నారు.

దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటివరకు ప్రత్యర్థిగా ఉన్న నేతలే (ఇతర పార్టీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు) ఇప్పుడు టికెట్లు పంపిణీ చేస్తుండటంతో వారిని తమ అనుచరుల కోసం టికెట్లు ఎలా అడగాలని మాజీ ఎమ్మెల్యే లు మథనపడుతున్నారు. అడిగినా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు.

నాడు ప్రత్యర్థులు.. ఇప్పుడు వాళ్లే దిక్కు!
రాష్ట్రవ్యా ప్తంగా ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. పరిషత్ టికెట్లు ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్యే లకే టీఆర్ఎస్ అధిష్టానం అప్పగిం చింది. ఇతర పార్టీల్లోంచి పార్టీలోకి వచ్చినఎమ్మెల్యేలకు కూడా ఈ అధికారాన్ని కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌‌ఎస్‌ లో చేరిన 14మంది ఎమ్మెల్యేల్లో 13 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పరిషత్ ఎన్నికలు  జరుగుతున్నాయి. కాం గ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి వచ్చి న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఫార్వర్డ్‌‌ బ్లాక్‌‌ నుంచి వచ్చి నఎమ్మెల్యే కోరు కంటి చందర్‌‌, ఇండిపెండెంట్‌‌ రాములునాయక్‌‌ తమ నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ క్యాండిడేట్లకు బీంఫాంలు ఇస్తున్నారు.

బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం బీఫాంలు పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేని ఎమ్మెల్యే ల సంతకాలతో ఇచ్చినవే కావడం గమనార్హం. రెండో విడతలో ఎన్నికలు జరుగనున్న పినపాక, సత్తుపల్లి, మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న ఇల్లెందు.. రెండు, మూడో విడతల్లో ఎన్నికలు జరిగే ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో పోటీపడ్డ తమ ప్రత్యర్థులకే బీఫాంలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి నుంచి పిడమర్తి రవి అభ్యర్థిత్వం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్మన్‌‌గా సీఎంకేసీఆర్‌‌ ప్రకటించిన కోవా లక్ష్మీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆమె సక్కు ఇచ్చిన బీఫాం తోనే నామినేషన్‌‌ వేయాల్సి న పరిస్థితి . అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు నుంచి ఓడిపోయిన తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనుకయ్య భద్రాద్రి జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. పినపాక, ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌‌పైగెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌‌ఎస్‌ లో చేరడంతో మాజీప్రత్యర్థులకు వాళ్లే బీఫాంలు ఇవ్వాల్సి వస్తోంది.

అన్నీ
వాళ్లకేనా?
పెద్ద నాయకుల టికెట్ల వరకు ఏ ఇబ్బంది లేకున్నా వారినే నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన క్షేత్రస్థాయి నాయకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అధిక శాతం  టికెట్లను తమ అనుచరులకే ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. విభేదాలను పక్కన పెట్టి వెళ్లి టికెట్‌‌ అడిగినా టికెట్‌‌పై భరోసా దక్కలేదని భద్రాద్రి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మండల స్థాయి నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో మాజీ ఎమ్మెల్యేల అనుచరులు టికెట్ల వేటలో వెనుకబడిపోతున్నారు.

ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో తమను కనీసం పట్టించుకున్న వారే లేరని మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మీటింగ్‌ మొత్తం వన్‌‌ మ్యాన్‌‌ షోలా సాగిందని మరికొం దరు అసహనం వ్యక్తం చేశారు. 13 ని యోజకవర్గాల్లో మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న క్షేత్రస్థాయి నేతలు ఇప్పుడు కలిసి పనిచేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. రాజకీయంగా తమకు వచ్చే అవకాశాన్ని పార్టీలో కి వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తన్నుకు పోయారని కొందరు బాహాటంగానే అంటున్నారు.

మరికొం దరు పార్టీ మారి టికెట్‌‌ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నా రు. తొలివిడతలో టికెట్‌‌ దక్కని పలువురు నేతలు కాంగ్రెస్‌ ,ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. జడ్పీటీసీల కన్నా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీఎక్కు వగా కనిపిస్తోంది. తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునే  విషయంపై పార్టీ పెద్దలకు సమాచారంఇచ్చి నా ప్రయోజనం ఉండటం లేదని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొందరు వాపోతున్నారు.