ఏటూరునాగారం అడవిలో పెద్ద పులి కలకలం.!

ఏటూరునాగారం అడవిలో పెద్ద పులి కలకలం.!
  • ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన లారీ డ్రైవర్

మంగపేట/ ఏటూరునాగారం, వెలుగు: ఏటూరు నాగారం అడవిలో పెద్ద పులి కలకలం రేపిన ఘటన ములుగు జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. చెక్ పోస్ట్ వద్ద పెద్దపులి రోడ్డు దాటుతుందని ఫారెస్ట్ అధికారులకు ఓ లారీ డ్రైవర్  సమాచారం ఇచ్చాడు. దీంతో  అలర్ట్ అయిన అధికారులు వెళ్లి.. ఏటూరు నాగారం – కమలాపురం పరిధి జీడివాగు వద్ద పరిశీలించారు. 

అయితే.. ఐదు రోజుల కిందనే మదనపల్లి అడవి ప్రాంతంలో పులి తిరిగిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో అటునుంచి ఏటూరు నాగారం అడవి ప్రాంతానికి కమలాపురం వైపు నుంచి వచ్చిందేమోనని అనుమానిస్తున్నారు.  ప్రజలు ఇండ్ల నుంచి బయటి రావద్దని మైక్ ద్వారా  అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి  ఆనవాళ్లు కనిపించలేదని..  సైన్ బోర్డు మీద పులి బొమ్మని చూసిన లారీ డ్రైవర్ భ్రమపడి ఉండొచ్చని ఫారెస్ట్ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ తెలిపారు.