భూపాలపల్లి అడవుల్లో పెద్దపులి..?

భూపాలపల్లి అడవుల్లో పెద్దపులి..?

చత్తీస్ గఢ్ అడవుల నుంచి వచ్చినట్లుగా అనుమానం

జయశంకర్ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడి అభయారణ్యంలో పులి అడుగుజాడలు కన్పించాయి. పొరుగున ఉన్న చత్తీస్ గఢ్ అడవుల నుంచి పెద్దపులి ఇటువైపు వచ్చిందని అనుకుంటున్నారు. మహాముత్తారం మండలంలో పులి, దాని పిల్ల సంచరించిన అడుగు జాడలను ఆదివారం ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇదే మండలంలోని నిమ్మగూడెంలో ఓ నల్ల ఆవును పులి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని తెలియడంతో అక్కడికి కూడా వెళ్లి విచారణ జరిపారు. పెద్దపులి అడుగులు నిజమేనని ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆజంనగర్ ఫారెస్ట్​ రేంజ్ ఆఫీసర్ ఆదిల్ మాట్లాడుతూ పెద్దపులి సంచరిస్తున్నట్లు అనుమానాలున్న స్థలాల్లో కెమెరాలతో ట్రాపింగ్ చేస్తామన్నారు. ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు.