
ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం జనాన్ని భయపెడుతోంది. నిన్నామొన్నటి వరకు భీంపుర్ మండలంలో సంచరించిన పులి.. తాజాగా జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జైనథ్ -నిరాల మధ్య మెయిన్ రోడ్డు క్రాస్ చేసి పంటపొలాల్లోకి వెళ్తున్న పులిని చూసిన జనం భయంతో వణికిపోతున్నారు. దీంతో పనులకు బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు.