
వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం, కోనాపురం ఎంపీటీసీ భర్తపై పులి దాడికి యత్నించింది. నర్సంపేట నుండి కొత్తగూడకి వెళ్తున్న సాదిరెడ్డి పల్లి ఎంపిటిసి భర్త ,అతని తమ్ముడు రాము బైక్ పై వెళ్తుండగా చెక్ పోస్టు సమీపంలో హఠాత్తుగా పులి రొడ్డు పైకి వచ్చింది. భయపడి బైక్ వదిలేసి అడవిలోకి పరిగెత్తారు అన్నదమ్ములు. తృటిలో ప్రమాదం తప్పింది.