రాచకొండ పరిధిలో భారీ బందోబస్తు

రాచకొండ పరిధిలో భారీ బందోబస్తు

ఎల్బీనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్లతో కలిసి ముందస్తు ప్లాన్​ వేశారు. కమిషనరేట్  పరిధిలోని లోక్ సభ స్థానాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు. ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో రాచకొండ పరిధి విస్తరించి ఉంది. మల్కాజ్ గిరి, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లోనూ పూర్తిస్థాయి భద్రత చేపట్టాల్సి ఉంది. సెక్యూరిటీ పెంచారు. కమిషనరేట్ పరిధిలో 1,521 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 137 ప్రాంతాల్లోని 358 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు.  ఇక్కడ అవాం ఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరిం చనున్నారు. 274 మంది రూట్ ఆఫీసర్లతో పోలిం గ్ లొకేషన్లను పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర బలగాలతో..

బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్ , ఆర్పీఎఫ్,సీపీఎంఎఫ్ లతో పాటు మొత్తం 11 కంపెనీల బలగాలతో వివిధ ప్రదేశాల్లో 4 వేల మంది సివిల్, 2 వేల మంది సాయుధ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సుమారు 20 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు రెవెన్యూ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, కేంద్ర బలగాలతో 40 ఫ్లాగ్ మార్చ్ నిర్వహిం చారు. అక్రమ డబ్బు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు 27 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 27 ఎస్.ఎస్.టీ టీమ్స్ తో 24 గంటలు తనిఖీలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 450 కేసుల్లో 1758 మందిని బైండోవర్ చేశారు. ఈ బైండోవర్ ఆరునెలల వరకు కొనసాగనుం ది. ఇందులో భాగంగాలా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిం చే 333మందిని గుర్తించారు. దీం తో పాటు 782 లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసుల వద్ద డిపాజిట్ చేసినట్లు సీపీ మహేశ్ భగవత్​ తెలిపారు.

భారీగా నగదు,లిక్కర్ సీజ్

శనివారం వరకు నిర్వహించిన వాహన తనిఖీల్లో 7 కేసుల్లో రూ.4,05,59,700 స్వాధీనం చేసుకున్నారు. 7 కేసుల్లో 794.98 లీటర్ల లిక్కర్ సీజ్ చేశారు.శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాప్స్ నిర్వహించేవారిని బైండోవర్ చేశారు. పెండిం గ్ లోని 307నాన్ బెయిలబుల్ వారెం ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్నిపోలిం గ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తించిన 137 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు.

రూల్స్ క్రాస్ చేయొద్దు

కమిషనరేట్ పరిధిలో భద్రత కట్టు దిట్టం చేశాం. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి. కేంద్ర బలగాలతో కలిసి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. డబ్బులు పట్టు బడితే ఆధారాలు చూపాల్సిందే. ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి తప్పనిసరి. రూల్స్ క్రాస్ చేస్తే చర్యలుతప్పవు.-మహేశ్ భగవత్, పోలీస్ కమిషనర్,రాచకొండ