
అమెరికాలో టిక్‌టాక్ నిషేధం మళ్లీ వాయిదా పడింది. అమెరికాలో టిక్ టాక్ నిషేధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ టిక్ టాక్ పై నిషేధంపై గడువును మరో 90 రోజులకు పెంచారు. చైనా మాతృసంస్త బైట్ దాన్స్ నుంచి టిక్ టాక్ ను లాక్కునే ప్రయత్నంలో అమెరికా ప్రభుత్వం డీల్ కుదుర్చుకునేందుక మరోసారి గడువు పెంచారు ట్రంప్. టిక్ టాక్ కంపెనీలో అధిక వాటా యూఎస్ యాజమాన్యంలోకి రావాలని ట్రంప్ ఆశిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ వీడియో షేరింగ్ యాప్ కు ఇది ట్రంప్ మూడో ఆఫర్.
టిక్ టాక్ ను పూర్తిగా బ్యాన్ చేయాలని ట్రంప్ ఉద్దేశ్యం కాదు.. అమెరికా ప్రభుత్వంతో సురక్షితమైన డీల్ కోసమే 90 రోజులు గడువు ఇచ్చారని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ట్రంప్ చైనాపై భారీ సుంకాలు విధించిన తర్వాత అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై గతంలో ఉన్న ఒప్పందాలకు అడ్డంకిగా మారింది. దీంతో బైట్ డాన్స్ అమెరికాతో డీ ల్ కుదుర్చుకోవాలని చైనా అనుమతి తీసుకోవాలని టిక్ టాక్ ఖరాఖండిగా చెప్పేసింది.
టిక్ టాక్‌కు చైనాతో ఉన్న సంబంధాలు అమెరికా జాతీయ భద్రతపై ఆందోళనలు లేవనెత్తాయి. అమెరికా యూజర్ డేటాను చైనీస్ కమ్యూనిస్టు పార్టీ యాక్సెస్ చేసే అవకాశం ఉందని భయాన్ని వ్యక్తం చేసింది. దీంతో 2025 జనవరి 19న టిక్ టాక్ అమెరికా చట్టాలను అమలు చేయడం గానీ, టిక్ టాక్ విక్రయించడం గానీ, లేదా పూర్తిగా నిషేధం గానీ ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం గడువిచ్చింది. ఆ గడువును జూన్ వరకు ఉండగా మరోసారి సెప్టెంబర్ వరకు పొడిగించారు ట్రంప్.