AUS vs SA: ఆసీస్ హల్క్ మరో విధ్వంసం.. సూర్యను వెనక్కి నెట్టి టాప్‌కు చేరుకున్న టిమ్ డేవిడ్

AUS vs SA: ఆసీస్ హల్క్ మరో విధ్వంసం.. సూర్యను వెనక్కి నెట్టి టాప్‌కు చేరుకున్న టిమ్ డేవిడ్

ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ అంతర్జాతీయ క్రికెట్ లో తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ 20లో సఫారీలకు తన బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. సహచరులు ఔటైనా ఒక్కడే వారియర్ లో పోరాడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆదివారం (ఆగస్టు 10) డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తొలి టీ20లో డేవిడ్ తన మార్క్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కేవలం 52 బంతుల్లోనే 83 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టు స్కోర్ లో దాదాపు సగం స్కోర్ డేవిడ్ కొట్టడం విశేషం. ఈ ఆసీస్ పవర్ హిట్టర్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లతో పాటు 8 సిక్సర్లు ఉన్నాయి. 

ఈ ఇన్నింగ్స్ తో టీ20 లో టిమ్ డేవిడ్ ఒక ఆల్ టైం రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ గా అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. కనీసం 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ లిస్ట్ తీస్తే డేవిడ్ 167.3 తో టాప్ లో ఉన్నాడు. తొలి స్థానంలో ఉన్న సూర్య కుమార్ యాదవ్ (167) ను వెనక్కి నెట్టి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సాల్ట్, రస్సెల్, ఫిన్ అలెన్, ట్రావిస్ హెడ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇటీవలే వెస్టిండీస్ పై సెంచరీ చేసిన ఈ ఆసీస్ హల్క్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లోనూ గొప్ప ఆరంభం లభించింది. 

ఈ మ్యాచ్ విషయానికి తొలి టీ20 లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చచేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టిమ్ డేవిడ్  52 బంతుల్లోనే 83 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గ్రీన్ 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగులు చేసి 17 పరుగులతో ఓడిపోయింది.