చిన్నారి వైద్య సాయానికి స్టార్ క్రికెటర్ జెర్సీ వేలం

చిన్నారి వైద్య సాయానికి స్టార్ క్రికెటర్ జెర్సీ వేలం

న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ టీమ్‌ సౌథీ.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. WTC ఫైనల్లో ధరించిన జెర్సీల్లో ఒకదానిని వేలానికి పెట్టాడు. ఆ వచ్చిన డబ్బును ఆ చిన్నారి ట్రీట్మెంట్ కు ఖర్చు చేయనున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సౌథీ 4 వికెట్లు తీసి భారత్‌ ఓటమికి కారణమయ్యాడు. అప్పుడు ధరించిన జెర్సీపైనే తన సహచర ఆటగాళ్లతో సంతకాలు చేయించి వేలంలో పెట్టాడు. న్యూరోబ్లాస్టోమా అనే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న హోలీ బీటీ అనే బాలికకు సాయం చేసేందుకే ఈ జెర్నీని వేలంలో పెడుతున్నట్లు సౌథీ తెలిపాడు.

జెర్సీ వేలం ద్వారా.. హోలీకి మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాడు సౌథీ. ఈ వేలానికి జులై 8 వరకూ బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపాడు. ఇవాల(మంగళవారం) ఉదయం వరకూ 152 బిడ్లు దాఖలు కాగా.. అత్యధికంగా 7 వేల డాలర్ల బిడ్‌ వచ్చిందని తెలిపాడు.