- డీఎఫ్వో నీరజ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్ మండలం వేంపల్లిలోని టింబర్ డిపోలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప వేలం కార్యక్రమాన్ని బుధవారం డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ప్రారంభించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన కార్పెంటర్లు, సామిల్ యజమానులు, టింబర్ డిపో యజమానులు, వ్యాపారులు కలిపి మొత్తం 18 మంది పాల్గొని బిడ్లు వేశారు.
సుమారు రూ.14 లక్షల ఆదాయం వచ్చినట్లు డీఎఫ్ వో తెలిపారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వేలం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. కలప అమ్మకం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిల్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శశిధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
