అటు నాటుతున్నారు.. ఇటు నరుకుతున్నారు

అటు నాటుతున్నారు.. ఇటు నరుకుతున్నారు

శివ్వంపేట, వెలుగు : పచ్చదనాన్ని పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం హరితహారం కింద మొక్కలు నాటిస్తుండగా, మరోవైపు అక్రమార్కులు యథేచ్చగా చెట్లు నరికి కలప అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని  తిమ్మాపూర్, చిన్న గొట్టిముక్కుల,  ఉసిరికపల్లి  గ్రామాల్లో కలప వ్యాపారులు 15 రోజులుగా చెట్లను నరుకుతూ.. కలప అమ్ముకుంటున్నారు. సహజంగా పెరిగిన చెట్లతో పాటు హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యాయి.

ఇటుక బట్టీలకు, సిమెంటు బ్రిక్స్ కంపెనీలకు కలప అవసరం అవుతుండగా అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది చెట్లను నరికి కలపను కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు ఈ విషయమై ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.