పిల్లల విషయంలో టైమ్​ మెనేజ్​మెంట్​ తప్పనిసరి

పిల్లల విషయంలో టైమ్​ మెనేజ్​మెంట్​ తప్పనిసరి

సక్సెస్​ఫుల్​ కెరీర్​, పర్సనల్​ లైఫ్​తో హ్యాపీగా ఉండాలంటే టైమ్​ మేనేజ్​మెంట్​ ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే.. పిల్లల విషయంలో టైమ్​ మెనేజ్​మెంట్​ తప్పనిసరి..  అందుకోసం ఎక్స్​పర్ట్స్​ చెప్తున్న టిప్స్​ ఇవి. 

  • ఏం చేసినా ఆర్గనైజ్డ్​గా ప్లాన్​ చేయాలి. మరుసటి రోజు చేయాల్సిన పనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందురోజే చేసుకోవాలి. దానివల్ల ఎలాంటి కంగారు ఉండదు. అలాగే వారంలో చేయాల్సిన పనుల్ని ముందుగానే లిస్ట్​ చేసుకోవాలి.. వాటిల్లో  ఏది ఇంపార్టెంట్​ అనిపిస్తే దానిపైన ఎక్కువ ఫోకస్​ చేయాలి. 
  • ఎవరెలాంటి ఉద్యోగం చేస్తున్నా, ఫ్యామిలీ మొత్తానికి ఒక కామన్​ క్యాలెండర్​ ఉండాలి. అందులో పిల్లలకి, ఫ్యామిలీకి సంబంధించిన స్పెషల్​ డేస్​ని రాసుకోవాలి.  దాన్నిబట్టి వర్క్​లైఫ్​ని బ్యాలెన్స్​ చేసుకోవాలి. 
  • ఆఫీసు టెన్షన్స్​ని అన్నింటినీ ఇంటి బయటే వదిలేయాలి . ఇంట్లో ఉన్నప్పుడు ​ స్ర్కీన్​ టైంని తగ్గించుకోవాలి. వీకెండ్స్​ని పిల్లల కోసం  కేటాయించాలి. వాళ్లని షికారుకి తీసుకెళ్లడం, వాళ్లతో ప్లేగ్రౌండ్​లో ఆడటం, కథలు చెప్పడం లాంటివి చేయాలి. దానివల్ల పెద్దవాళ్లకి పని ఒత్తిడి తగ్గుతుంది. వారం మొత్తం తల్లిదండ్రులు తమతో ఉండట్లేదన్న ఫీలింగ్​ పిల్లలకి ఉండదు . 
  • పేరెంట్స్​ ఉద్యోగాలకి వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఫీల్​ అవ్వకుండా ఆ టైమ్​లో వాళ్లను డాన్స్​, మ్యూజిక్​, స్విమ్మింగ్​ క్లాసుల్లో ఎంగేజ్​ చేయాలి. పిల్లల ఇంట్రెస్ట్​ని బట్టి ఆటలు, పెయింటింగ్​ లాంటివి నేర్చుకునేందుకు చేర్చొచ్చు. 
  • రోజంతా స్కూల్లో ఏం చేశారనేది పేరెంట్స్​ తెలుసుకోవాలి. దగ్గరుండి హోంవర్క్​ చేయించడం వల్ల పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్​, ఎందులో స్ట్రాంగ్ అని తెలుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ పార్టీలకు వెళ్లాలి. పిల్లలకు సంబంధించిన ప్రతి వేడుకను ఆనందంగా జరుపుకోవడం వల్ల కెరీర్​తో పాటు ఫ్యామిలీ లైఫ్​లోనూ హ్యాపీగా ఉండొచ్చు.