‘టిమ్స్’ బరిలో  మేఘా, ఎల్​అండ్​టీ, డీఈసీ ఇన్ ఫ్రా 

‘టిమ్స్’ బరిలో  మేఘా, ఎల్​అండ్​టీ, డీఈసీ ఇన్ ఫ్రా 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్ (గడ్డి అన్నారం)లో నిర్మించనున్న మూడు టిమ్స్ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ టెండర్లను శుక్రవారం ఆర్ అండ్​ బీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఏ హాస్పిటల్ వర్క్​ను ఏ కంపెనీ ఎంత టెండర్​కు దక్కించుకున్నదో అధికారులు వెల్లడించనున్నారు. ఈ దవాఖాన్ల నిర్మాణానికి ఎల్ అండ్ టీ, మేఘా, డీఈసీ ఇన్ ఫ్రా కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేసినట్లు ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఈ హాస్పిటల్స్ నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.

టెండర్లకు షాపూర్ జీ దూరం

ప్రభుత్వం నిర్మించనున్న టిమ్స్ హాస్పిటల్స్​కు షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ దూరంగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఆలస్యంగా చేస్తున్నారని కంపెనీ ప్రతినిధులపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. దీంతో సెక్రటేరియట్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఇతర ప్రాజెక్టులకు టెండర్ దాఖలు చేయెద్దని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   

మూడు టిమ్స్ ల విస్తీర్ణం, ఖర్చు ఇలా..   

అల్వాల్: 28.41 ఎకరాలు, రూ.897 కోట్లు

గడ్డిఅన్నారం: 21.36 ఎకరాలు, రూ.900 కోట్లు

ఎర్రగడ్డ: 60 ఎకరాలు, రూ. 882 కోట్లు