కుట్రలో భాగంగానే తీన్మార్ మల్లన్న అరెస్ట్ : వివేక్ వెంకటస్వామి

కుట్రలో భాగంగానే తీన్మార్ మల్లన్న అరెస్ట్ : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో సంబంధం ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని ఆయన చెప్పారు. పోలీసులు సైతం బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోయారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఉందని వివేక్ విమర్శించారు. కుట్రలో భాగంగానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని, ప్రశ్నించే  గొంతుకలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై బీజేపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. 

తప్పుడు సెక్షన్స్ సృష్టించి తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇంతకుముందు ఇలాగే చేశారని, ఇప్పుడూ అదే చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువయ్యాయని వాళ్లకు తెలిసిపోయిందని, అందుకే ఇలా ప్రశ్నించే వారిపై అటాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో మల్లన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.