
తిరుమలకు భక్తులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి బయట రెండు కిలోమీటర్ల వరకు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటలు పడుతోంది. సర్వదర్శనం టైమ్ స్లాట్ భక్తులకు సుమారు 8 గంటలు మరోవైపు అద్దెగదులు లభించక రెండు రోజులుగా భక్తులు తీవ్ర ఇభ్బందులు పడుతున్నారు.