
తిరుమల పుణ్యక్షేత్రంమొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. 26 వ మలుపు దగ్గర కూలీల వాహనం అదుపుతప్పి పిట్టగోడను ఢీ కొట్టిందిః. ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం అయింది, సమాచారం అందుకున్న సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 20 మంది కూలీలు తిరుమలలో పని చేసి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఏడుకొండల స్వామి దయతో పెద్ద ప్రమాదం తప్పిందని కూలీలు తెలిపారు.
- ALSO READ | తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..