తిరుమలలో రికార్డు ఆదాయం.. జులై3న గరుడ సేవ

తిరుమలలో రికార్డు ఆదాయం.. జులై3న గరుడ సేవ

 తిరుమలలో భక్తుల రద్దీ  కొనసాగుతోంది. భక్తుల సందడి తిరుమలలో కనిపిస్తోంది. శనివారం (జులై1) 82 వేల 999 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి 4 కోట్ల 27 లక్షల  రూపాయలు చెల్లిచారు భక్తులు. వేసవి సెలవులు ముగిసిన తరువాత కూడా ఇంత ఆదాయం రావడం నిజంగానే రికార్డు అంటున్నారు టీడీటీ అధికారులు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.

ఆదివారం( జులై2) మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక శనివారం (జులై1) నాడు 38వేల875 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు., మజ్జిగ., కిచిడి., ఉప్మా., సాంబార్ రైస్., పెరుగన్నం., అందిస్తోంది.  టీటీడీ  సామాన్య భక్తుల కొరకు తిరుపతిలోని శ్రీనివాసం., విష్ణు నివాసం., గోవిందరాజ స్వామి వారి సత్రాల్లో ఎస్ఎన్డీ టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.

జులై 3న 3న పౌర్ణమి గరుడ సేవ

సోమవారం (జులై3) గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో  గరుడ సేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.