తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే...

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే...

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణ గిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. వేసవి సెలవుల చివరి రోజులు, వీకెండ్ కావడంతో  తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దర్శన టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. క్యూలైన్‌లోని భక్తులకు టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ కారణాంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ తెలిపింది. వేసవి కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లిడించింది.

ఇదిలా ఉండగా..  నిన్న(జూన్2) శ్రీవారిని 76,963 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 37,422 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.  భక్తులు సమర్పించిన కానుకల ద్వారా గురువారం( జూన్1) స్వామివారికి రూ.2.97 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.  తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుబాటులో త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఉంచింది.