తిరుమలలో భారీగా రథసప్తమి వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి

తిరుమలలో భారీగా రథసప్తమి వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.  భక్తులకు అన్ని విధాలుగా సంతృప్తి చెందేందుకు ప్రణాళికా బద్దంగా ఏర్పాటు చేసశామన్నారు.  శ్రీవారి మాడ వీధుల్లో రథ సప్తమి ఏర్పాట్లను టీటీడీ జేఈఓ.. వీరబ్రహ్మం.. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు.. సీవీఎస్వో మురళీ కృష్ణలు కలిసి  పరిశీలించారు. 

మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

 రథ సప్తమి సందర్భంగా ఇప్పటికే తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తుల భద్రత.. టీటీడీకు సంబంధించి అన్ని  విభాగాల  సమన్వయం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల దగ్గర  తీసుకోవాల్సి చర్యల గురించి చర్చించి అధికారులకు సూచించారు.  గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండకు... వర్షానికి ఎలాంటి ఇబ్బందులు  పడకుండా పందిళ్లు ఏర్పాటు చేశారు.