తిరుమల ఆర్టీఏ, పోలీసుల అధికారులు తనిఖీలు.. ప్రైవేట్ ట్యాక్సీలకు భారీగా జరిమానా
తిరుమలలో ఆర్టీఏ అధికారులు .. పోలీసులు ప్రైవేట్ ట్యాక్సీలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాహనాలపై కొరడా ఝళిపించారు. డాజలింగ్ హెడ్లైట్స్, అధిక కాంతి వెలువరించే లైట్లను తొలగించారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న హారన్లపై ప్రత్యేక తనిఖీలు చేశారు. వాహనాల్లో అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్స్ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాత్రి వేళల్లో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలపై చర్యలు తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో రూ.1.45 లక్షల జరిమానా వసూలు చేసినట్లు రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ తనిఖీల్లో తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
