తిరుమలలో ఫుల్ రష్ : దర్శనానికి 26 గంటల సమయం

తిరుమలలో ఫుల్ రష్ : దర్శనానికి 26 గంటల సమయం

తిరుమల క్షేత్రం  భక్తులతో  కిటకిటలాడుతోంది. ఎన్నికల  ఫలితాలు  రావడంతో  సామాన్యులతో పాటు …..వి.ఐ.పిలు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో  దర్శనానికి  వెళ్లే  కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి… దాదాపు ….మూడు   కి.మీ వరకు  బయట బారులు  తీరారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి  26 గంటలకు పైగా  సమయం పడుతుండగా.. కాలినడకన వచ్చే వాళ్లతో  పాటు.. టైం  స్లాట్  టోకెన్, ప్రత్యేక  ప్రవేశ దర్శనాలకి  8 గంటల సమయం పడుతోంది.  దీంతో  పది నుంచి 15  గంటలదాకా  భక్తులు క్యూలైన్లలోనే   వేచి ఉండాల్సి  వస్తోంది. భక్తుల రద్దీతో  అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం  కౌంటర్లతో పాటు  ఆలయ పరిసర  ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.