
వైకుంఠ దర్శనానికి రెండు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గతంలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పిస్తామని చెప్పిన టీటీడీ చైర్మన్ ఇప్పుడు రెండు రోజులు మాత్రమే దర్శనం ఉండనున్నట్లు చెప్పారు.
శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమలకు వెళ్లగా.. వారిని మర్యదపూర్వకంగా కలుసుకున్నారు సుబ్బారెడ్డి. మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి. తిమలలోని ఉత్సవమూర్తుల విగ్రహాలు అరుగుదల అంశాన్ని స్వరూపానంద స్వామితో చర్చించినట్లు తెలిపారు. పలు చారిత్రక ఆలయాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్వామి సూచించినట్లు తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా ప్రతీనెల టీటీడీ తరపున ప్రత్యేక కార్యక్రమం ఉండనున్నట్లు చెప్పారు సుబ్బారెడ్డి.