వృద్ధులు, దివ్యాంగులకు.. నేడు శ్రీవారి ఉచిత దర్శనం

వృద్ధులు, దివ్యాంగులకు.. నేడు  శ్రీవారి  ఉచిత దర్శనం

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం ప్రత్యేక ప్రవేశ దర్శన కల్పించేందుకు 4 వేల టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఉదయం 10 గంటల స్లాట్‌‌‌‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌‌‌‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తామని అధికారులు చెప్పారు. ఐదేళ్లలోపు చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బుధ‌‌‌‌వారం ఉద‌‌‌‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌‌‌‌ల వ‌‌‌‌ర‌‌‌‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

ఘ‌‌‌‌నంగా దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో  ఆదివారం దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్ల సమక్షంలో బంగారువాకిలి వద్ద  మలయప్పస్వామి, అమ్మవార్లు, విష్వక్సేనుల ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఘనంగా ఆస్థానం నిర్వహించారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి