అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం : తిరుపతిరెడ్డి

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం : తిరుపతిరెడ్డి

కొడంగల్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​పాలన అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్తుందని   కొడంగల్ సెగ్మెంట్ కాంగ్రెస్​ ఇన్ చార్జ్ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో రైతులకు రుణ విముక్తి కలుగుతుందని తెలిపారు. కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డితో అభివృద్ధి  పనులకుగురువారం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్​, బొంరాస్​పేట మండలాల్లో రూ. 23 కోట్ల నిధులతో నిర్మించే జానకంపల్లి – మహంతిపూర్​, దేవనూర్​ రోడ్డు కమ్​బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు.

అంగడిరైచూర్​ గేట్​–లక్ష్మీపల్లి, రుద్రారం వరకు డబుల్ రోడ్డు, బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొంరాస్​పేటలో  నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​చెక్కులు అందజేశారు. కొడంగల్​లో 205 మంది పేదలకు రూ. 1.39 కోట్ల సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఇగావల మృతిచెందిన పలువురు కాంగ్రెస్​ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంటనే నేతలు ప్రశాంత్​, ముద్దప్ప, శివకుమార్​గుప్త, ఆనంద్​రెడ్డి, నర్సింలు గౌడ్​, నర్సింహనాయుడు ఉన్నారు.